హైదరాబాద్‌‌ను కాంక్రీట్ జంగల్‌‌గా మార్చేశారు..సర్కారుపై బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆగ్రహం

హైదరాబాద్‌‌ను కాంక్రీట్ జంగల్‌‌గా మార్చేశారు..సర్కారుపై బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీని కాంక్రీట్ జంగల్‌‌గా మార్చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. పెద్దలకు రాజభవనాలు, పేదలకు బుల్డోజర్లు అనే రీతిలో సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌‌‌‌తో కలిసి  ఆయన మీడియాతో మాట్లాడారు. ముషీరాబాద్ ప్రాంతంలోని అల్లంబాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

సిటీలో హైడ్రా, హిల్ట్, క్యూర్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూదోపిడీకి పాల్పడుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. కాగా, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడి చేయడంపై డీజీపీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది.